
కోవిడ్ సమయంలో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వార్తతో బుధవారం తీన్మార్ మల్లన్న లైవ్ న్యూస్ ప్రారంభమైంది.
కూలీలుగా టీచర్లు
టీచర్లు కూలీలుగా మారిన వైనాన్ని మల్లన్న ఎండగట్టారు. కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నామని.. కరోనా సమయంలోనూ మనకు ఆదాయం తగ్గలేదని కేసీఆర్ చెప్పిన మాటలను మల్లన్న తప్పుపట్టారు. మరి టీచర్లను ఎందుకు ఆదుకోవడం లేదని, ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
కోర్టు ధిక్కరణ కేసు
కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు కలెక్టర్లకు మూడు నెలల జైలు. భూ సేకరణ కింద అవినీతి. సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి ఏక నంబర్ చోర్ అంట అని మల్లన్నచెప్పారు.
ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత
పల్లా రాజేశ్వర్ రెడ్డికి, వాణి దేవికి ఓటేయాలని పీఆర్‌సీయూ ఇతర సంఘాల నేతను సీఎం కేసీఆర్ అడిగిండంట. మేము మద్దతివ్వమని వారు చెప్పే సరికి రేపటి నుంచి స్కూళ్లకు వెళ్లాలని ఆన్‌లైన్ బంద్ అని సీఎం చెప్పారంట. జీవో కూడా విడుదల చేశారంట.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నీరు ఎత్తిపోయడానికి రూ. 17.58 కోట్ల కరెంట్ బిల్లుపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బిస్లరీ బాటిళ్లతో పోసినా ఇంత ఖర్చు రాదని అన్నారు.
ఉద్యోగులపై చిన్న చూపు
ప్రమోషన్లు రావు, ట్రాన్స్‌ఫర్లు కావు, ఫిట్‌మెంట్ సాగతీత. ఉద్యోగ సంఘాల నేతలకు ఓడీలు కట్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయలేదన్న కోపంతో టీఆర్ఎస్ పెద్దలున్నారు. మీకు ఓటేస్తే మంచిది లేకపోతే లేదా అని మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడే నీ ముఖం చూపిస్తున్నావంటూ టీఆర్ఎస్‌కే చెందిన ఓ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డిని అన్న ఆ వీడియోను మల్లన్న చూపించారు.
ఉద్యోగాలు పూర్తిగా నింపలే
ఉద్యోగాలు పూర్తిగా నింపలేదని, ఇంకా ఖాళీలు ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మల్లన్న తీవ్రంగా స్పందించారు. మొన్ననేమో 1 లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న ప్రభుత్వం ఇప్పుడు ఇంకా ఖాళీలు ఉన్నాయని భర్తీ చేస్తామని చెప్పడమేంటని మల్లన్న ప్రశ్నించారు. నీది మీ నాయనది నాలుకనా లేక తాటి మట్టనా తమ్మీ అని అడిగారు.
ఇలాంటి మరెన్నో వార్తా కథనాలు వినాలనుకుంటే కింది వీడియోను చూడండి…