
కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతీ ఇరానీ వారణాసి వీధుల్లో పానీ పూరీ లాగించారు.
ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఓ పానీ పూరీ సెంటర్ కు వెళ్లి, పానీ పూరీలను తింటూ మీడియా కంటపడ్డారు.
సాధారణంగానే స్ట్రీట్ ఫుడ్ ను స్మృతి ఇష్టపడుతారు. దీంతో పానీ పూరీలు ఎలా ఉన్నాయని మీడియా ప్రతినిధులు అడగగా ‘హరహర మహాదేవ్’ అంటూ అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయారు.
వారణాసిలో జరుగుతున్న బీజేపీ సమావేశాలకు హాజరాయ్యేందుకు ఆమె అక్కడికి వచ్చారు.
ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు కూడా హాజరయ్యారు.
ఇదే సమయంలో రోడ్డుపై స్మృతీ ఇరానీని చూడగానే అక్కడి స్థానికులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.