భారత్ నుంచి కోటి డోస్ లు కొనుగోలు చేసిన బ్రిటన్

156
Two elderly people died corona vaccine

భారత సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి బ్రిటన్ కోటి డోస్ ల ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో యూకే ప్రభుత్వం వెల్లడించింది.

యూకే తరఫున మొత్తం 10 కోట్ల డోస్ లను సీరమ్ కు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. తొలి విడతలో కోటి టీకా డోస్ లు రానున్నాయని ఆ దేశ అధికారులు ప్రకటించారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికాలు సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ ను భారీ సంఖ్యలో సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసింది. ఇప్పటికే పలు పేద, మధ్యాదాయ దేశాలకు సరఫరాచేసింది.

బ్రిటన్ కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ రెగ్యులేటరీ ఏజన్సీ (ఎంహెచ్ఆర్ఏ) ప్రతినిధులు సీరమ్ ఇనిస్టిట్యూట్ లో తయారీ విధానాన్ని ఆడిట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

అక్కడి నుంచి టీకా వయల్స్ ను క్షేమంగా బ్రిటన్ చేర్చే ప్రక్రియనూ పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో ధనిక దేశాలు పేద దేశాలకు వ్యాక్సిన్ ను అందించకుండా చేస్తున్నాయన్న విమర్శలూ వస్తున్నాయి.

బ్రిటన్ వంటి దేశాలు తొలుత వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించినప్పటికీ, ప్రస్తుతం పెద్దమొత్తం టీకాల సరఫరా కోసం ఇండియా వైపు చూస్తున్నాయి.