హంతకులను వదిలిపెట్టం: కేటీఆర్‌

198
BJP leaders give only slogans: KTR

న్యాయవాదులు వామనరావు దంపతుల హంతకులను వదిలిపెట్టబోమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణ భవన్‌లో నిన్న నిర్వహించిన టీఆర్ఎస్ న్యాయవాద విభాగం సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం కోసం కృషి చేస్తామని అన్నారు.

న్యాయవాదుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక నేతను పార్టీ నుంచి తొలగించినట్టు చెప్పారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా లాయర్ల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు అమలుచేసిన విషయాన్ని వివరించారు.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో సమానంగా న్యాయవాదులు లాఠీ దెబ్బలు తిన్నారని కేటీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ. 100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.జీడీపీని పెంచుతామని పెట్రో, గ్యాస్ ధరలను కేంద్రం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానిస్తే, తాము మాత్రం ఆయనను ఎంతగానో గౌరవిస్తున్నామని చెప్పారు. ఆయన కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చామని అన్నారు.