
తీన్‌మార్ మల్లన్న మంగళవారం ఖిల్లా వరంగల్ నుంచి మార్నింగ్ న్యూస్ లైవ్ ఇచ్చారు.
కరోనా కరువులోనూ అధికారులు ఇంటి పన్ను గురించి అడగడంతో ఆగ్రహించిన మహిళ వీడియోను ప్లే చేశారు.
సాధారణ మహిళ ఆగ్రహం
సాధారణ మహిళ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమెతో మల్లన్న లైవ్‌లో మాట్లాడించారు. ఆమె తన బాధలను ఏకరువు పెట్టింది. తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలే లేవని ఆమె చెప్పింది.
ఎక్కడ చూసినా అవినీతే అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వంపై, కేసీఆర్, కేటీఆర్‌లపై దుమ్మెత్తిపోసింది.
వంట గ్యాస్ పెరగడంపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్వకేట్ దంపతుల వామనరావు, నాగమణి హత్య కేసులో పోలీసులకు హై కోర్టు అక్షింతలు.
ఫలితాల ఆధారంగా ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ మాదిరిగానే ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఫలితాల ఆధారంగానే ఎమ్మెల్లేలు, మంత్రులకు కూడా జీతాలు ఇవ్వాలని మల్లన్న అన్నారు.
చంద్రబాబు నిర్బంధం వార్తను చదువుతూ గతంలో జగన్‌ను ఎలా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయిందని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై వెలుగు పత్రిక ప్రచురించిన వార్తను మల్లన్న చదివారు. తన పేరును మరుగున పడేసేందుకు సీఎం కేసీఆర్ అత్యధిక మందితో ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేయిస్తున్నారని చెప్పారు.
హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనంలో కేసీఆర్, కేటీఆర్ బొమ్మలను తీయాల్సిందేనని మల్లన్న మరోసారి అన్నారు.
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఎవ్వరూ తీసుకోరని మల్లన్న చెప్పారు.
చనిపోయి ఏడాది అయినా బీమా అందడం లేదనే వార్తను చదువుతూ.. రాష్ట్ర సర్కార్ నుంచి అందని నష్టపరిహాం.
సర్కార్ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లవంటున్న ఎల్ఐసీ.
అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండానే బీమా పైసలు నేరుగా అకౌంట్లో పడతాయని బాతాల పోషెట్టి చెప్పిండని మల్లన్న అన్నారు.
అవేవీ జరగడం లేదని చెప్పారు. కేసీఆర్ మాట వింటే ఆత్మలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయని చెప్పారు.
చమురు ధరల పెరుగుదలపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, కేసీఆర్ ఇద్దరు కలిసి దోచుకుంటున్నారని చెప్పారు.
పర్యాటకం ప్రైవేటు పరం వార్తను చదువుతూ.. సంస్థలను ప్రైవేటు పరం చేయడంలో మోడీ, కేసీఆర్ పోటీ పడుతున్నారని మల్లన్న అన్నారు.
మరో వివాదంలో ముత్తిరెడ్డి వార్తను చదివి అతను కబ్జా కోర్ అని చెప్పారు. ఉస్మానియాను అమ్మేస్తారని రేవంత్ రెడ్డి వార్తను చదివి అది ఎప్పుడో జరిగిందని మల్లన్న అన్నారు.
సర్వం తానై అనే సాక్షి వార్తను చదివి కేసీఆర్ బీజీ అన్న వ్యాక్యాన్ని చదివారు. బిజీ లేదు ఏమీ లేదు అని చెప్పారు.
ఎస్‌బీఐ బంపర్ ఆఫర్ అని చదివి ఏ బ్యాంక్ కూడా ఉట్టిగనే ఇస్తాదా? అని ప్రశ్నించారు.
సింగరేణి.. భరోసా వార్తను చదివిన మల్లన్న త్వరలో సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే ఇవన్నీ చేస్తున్నారని చెప్పారు.
చివరిలో నమస్తే తెలంగాణ పేపర్‌ను అభిషేకం చేయాలనుకుంటున్నానంటూ ఆ పేపర్‌ను తీసుకెళ్లి మోరీలో ముంచి పైకెత్తి మళ్లీ దాంట్లోనే పడేశారు మల్లన్న.
ఖిలా వరంగల్ ప్రజల మల, మూత్రాలు ఇందులోనే ఉంటాయి కాబట్టి వాటితో అభిషేకం చేస్తి సరిపోతుందని అన్నారు.
చివరిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సీరియల్ నంబర్ 39 అని అందరికీ ఈ విషయం చెప్పాలని కోరుతూ ఈ మార్నింగ్ న్యూస్‌ను మల్లన్న ముగించారు.