వేసవి కాలం వచ్చేసింది. చెమట ఎక్కువగా రావడం వల్ల మన ఒంట్లోని శక్తి తగ్గిపోతుంది.
దీంతో నీరసించి పోతాం. అలసట కూడా వస్తుంది. మరి ఈ నీరసం పోవాలి, తిరిగి బలం పుంజుకోవాలి అంటే ఈ వేసవి కాలంలో కొన్ని చిట్కాలు పాటించడం చాలా అవసరం.
అవేంటో ఓసారి చూద్దాం… ఎండాకాలంలో శరీరంలోని లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో నీరసం వస్తుంటుంది.
అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా త్వరగా అలసిపోకుండా ఉంటాము.
వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయ. నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శక్తిని కోల్పోకండా ఉంటాము. వీటి వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది.
ఎండా కాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పండ్ల రసాలను ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో పండ్ల రసాలతోనే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అంటున్నారు. ఎండాకాలంలో అధికంగా దాహమేస్తుంది. అందువల్ల అహారం తక్కువ తీసుకోవడం జరుగుతుంది.
అందుకే ఇతర పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌లను తీసుకోవడం కంటే పండ్ల రసాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ పండ్ల రసాలతో మరెన్నో ప్రయోజనాలున్నాని వైద్యులు అంటున్నారు.
ఈ జ్యూస్‌ల కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని, రక్తం శుద్ది అవుతుందని చెబుతున్నారు. వాటర్‌మిలాన్‌ను జ్యూస్‌లా కాకుండా నేరుగా తీసుకుంటే ఇంకా ఎంతో మంచిదంటున్నారు.
ఎండా కాలంలో ఎక్కువగా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.
పండ్ల రసాలు తాగడం వల్ల ప్రయోజనాలు
- పండ్ల రసాలతో విటమిన్-ఎ,సి పుష్కలంగా లభిస్తాయి
- మలబద్దంగా సమస్య తొలగిపోతుంది.
- ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు
- కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండ చేస్తాయి
- చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి.
- పేగుల్లో మలినాలు తొలగిపోయి శుద్ది చేస్తాయి.
- ఎసిడిటి, అల్సర్ సమస్యను నివారిస్తాయి
- నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్‌లలో పోటాషియం బి6, బి1,బి2 విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అజీర్తి సమస్య
దూరమవుతంది. - శరీరంలో నీటి శాతం పెరుగుతుంది
- బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
- పుచ్చకాయల్లో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి
- గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.
- డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంటుంది.
- శరీరంలో ఉన్న వ్యర్థాలు తొలగిపోతాయి