మనిషి మానవత్వం మరిచి రాక్షసుడిలా తయారవుతున్నాడు. ఈ కథను వింటే రాక్షసులు కూడా బాధపడతారేమో.
ఎందుకటే మనం చదివిన కథల్లో ఎక్కడా రాక్షసులు ఇలాంటి పనిచేయలేదు. అందుకే వీడు రాక్షసుడు కాదు.. అంతకు మించి.
వివరాల్లోకి వెళితే.. పక్కింటి మహిళను దారుణంగా చంపడమే కాకుండా ఆమె గుండెను పీకి.. బంగాళ దుంపలతో కలిపి కూర వండాడు.
ఆ కూరను తాను ఉంటున్న బంధువులకు వడ్డించాడు. ఆ తర్వాత వాళ్లను కూడా కిరాతకంగా చంపేశాడు.
ఓక్లహోమాలోని చికాషాలో ఈ దారుణం చోటుచేసుకుంది. 42 ఏళ్ల లారెన్స్ పాల్ అండర్సన్ 2017లో మాదకద్రవ్యాల సరఫరా కేసులో అరెస్టయ్యాడు.
కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓక్లహోమా పర్డోన్ అండ్ పేరోల్ బోర్డ్ సిఫార్సు మేరకు గవర్నర్ కెవిన్ స్టిట్.. ఇతని శిక్షను తొమ్మిదేళ్లకు కుదించారు.
అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్న లారెన్స్ జనవరి నెలలో పెరోల్ మీద బయటకు వచ్చాడు. అప్పటి నుంచి తన బంధువులతో కలిసి ఉంటున్నాడు.
లారెన్స్‌కు అకస్మాత్తుగా ఏమైందో ఏమో తెలీదు కానీ తమ ఇంటి పక్కన ఉన్న మహిళ అండ్రియా లేన్ బ్లాంకెన్‌షిప్‌పై దాడి చేసి చంపేశాడు.
ఆ తర్వాత ఆమె గుండెను బయటికి తీసి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ గుండెను కోసి, బంగాళా దుంప ముక్కల్లో కలిపాడు.
ఆ తర్వాత వాటితో కూర వండాడు. తన అంకుల్, ఆంటీ, వాళ్ల మనవరాలికి ఆ కూర తినిపించాడు. అనంతరం వారిపై కూడా కత్తితో దాడి చేశాడు.
వారి అరుపులు కేకలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే లారెన్స్ ఆ అంకుల్‌ను (67) చంపేశాడు.
తీవ్రంగా గాయపడిన చిన్నారి యటేస్‌ను హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. లారెన్స్ తన ఆంటీ డెల్సియా పేయి రెండు కళ్లను కత్తితో పొడిచేశాడు.
ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. పోలీసుల విచారణలో లారెన్స్ పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పాడు.
తన కుటుంబాన్ని రాక్షసుల బారి నుంచి రక్షించడానికే పక్కింటి మహిళ గుండెతో బంగాళ దుంపల కూరలో వండి తినిపించానని తెలిపాడు.
అయితే కుటుంబ సభ్యులను ఎందుకు చంపావనే ప్రశ్నకు మాత్రం అతడు బదులు ఇవ్వలేదు. దీంతో పోలీసులు అతడు ఈ హత్యలు డ్రగ్స్ మత్తులో చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
లారెన్సును ఇటీవల గ్రాడే కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నరీ జాసన్ హిక్స్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా లారెన్స్ న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
‘నాకు బెయిల్ వద్దు.. బెయిల్ వద్దు’ అని అరిచాడు. కోర్టు అతడికి మరణ దండన విధించే అవకాశాలున్నాయి.
లారెన్స్ తన బంధువులను చంపిన రెండు రోజుల తర్వాత పక్కింటి మహిళ ఆండ్రియా శవం లభించిందని పోలీసులు తెలిపారు.