
దొడ్డి దారిలో సంపాదించాలన్న ఆలోచన మనిషి చేత ఏ పనైనా చేయిస్తుంది.
విచక్షణను చంపేస్తుంది. ఉచ్ఛ నీచాలను మరిపిస్తుంది.
దీంతో ఎటువంటి దారుణానికైనా దిగజారుతారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడుతున్న కొందరు మహిళలు తమకు వచ్చే ఆదాయం సరిపోక పక్కదారి పడుతున్నారు.
అసాంఘిక కార్యకాలపాలకు పాల్పడుతున్నారు. మల్కాజ్‌గిరిలో ఉంటున్న ఓ మహిళ ఇలాంటి చర్యలకు పాల్పడి పోలీసులకు చిక్కింది.
మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన పూజా కాంబ్లే అనే మహిళ మల్కాజిగిరిలో టిఫిన్ సెంటర్‌లో పని చేస్తుంది.
విలాస జీవితానికి అలవాటు పడ్డ ఆమె కొంత కాలంగా ఇతర రాష్ట్రాల యువతులను తీసుకువచ్చి తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది.
దీనిపై చుట్టుపక్కల వాళ్లకు అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం రాత్రి ఇంటిపై దాడి చేసి ఆమె వ్యభిచార దందా గుట్టును రట్టు చేశారు.
నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.