“ఉప్పెన”పై మహేష్ బాబు ప్రశంసలు

234
Mahesh Babu Praises Uppena Team

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అయిన చిత్రం “ఉప్పెన”. ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది.

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి నటన, కథ, బుచ్చిబాబు దర్శకత్వం, పాటలు ఈ ‘ఉప్పెన’ సినిమా విజయవంతం కావడానికి కారణమని చెప్పొచ్చు.

ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ మూవీ నిలిచింది.

ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తున్న ఈ సినిమా 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.

కాగా ఇప్పటికే ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా “ఉప్పెన” చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

“ఉప్పెన.. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసిక్! బుచ్చిబాబు సానా.. మీరు కలకాలం గుర్తుండిపోయే అరుదైన చిత్రాన్ని రూపొందించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.

ఉప్పెనకు హార్ట్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా ఆల్‌టైమ్ గ్రేట్ మ్యూజిక్ స్కోర్స్‌లో ఒకటిగా గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు అందించిన సంగీతంలో ఇది అత్యుత్తమం డీఎస్పీ.

ఇలానే మంచి మ్యూజిక్ అందిస్తూ ఉండండి. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి అద్భుత నటన నా మనసును హత్తుకుంది. మీరు స్టార్స్.

ఇక చివరిగా ఉప్పెన లాంటి సినిమాను నిర్మించిన సుకుమార్ గారికి, మైత్రీ మూవీ మేకర్స్‌కి హ్యాట్సాఫ్.

నేను చెప్పినట్టుగా ఇది కలకాలం గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి.

మీ అందరినీ చూసి నాకు చాలా గర్వంగా ఉంది’’ అని మహేష్ బాబు తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు.

మహేష్ బాబు ట్వీట్‌కు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్పందించారు. “థాంక్ యు ఎ మిలియన్ టైమ్స్ డియరెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు సార్…

నేనెప్పుడూ చెప్పినట్టుగానే, ప్రేమతో కూడిన వెలకట్టలేని మాటలు చెప్పే సూపర్ స్టార్ హార్ట్ మీ సొంతం.

మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సార్” అని దేవిశ్రీ ట్వీట్ చేశారు.