సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ఈరోజు తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్, నమ్రత ఒకరినొకరు విష్ చేసుకున్నారు.
“16 ఏళ్లు చాలా సులభంగా గడిచిపోయాయి. బలమైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది.
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మహేష్ బాబు. నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాను” అంటూ నమ్రత మహేష్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసింది.
View this post on Instagram
ఇక మహేష్ బాబు నమ్రతను ముద్దు పెట్టుకున్న చిత్రాన్ని షేర్ చేస్తూ లవ్ ఎమోజీలతో నమ్రతకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు సోషల్ మీడియాలో మహేష్, నమ్రతలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
View this post on Instagram
కాగా మహేష్ ఫ్యామిలీ ఇప్పుడు “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ నిమిత్తం దుబాయ్ లో ఉన్నారు. ఇప్పటికే సినిమా లొకేషన్ నుంచి మహేష్ షేర్ చేసిన పిక్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ సరికొత్తగా, మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇక “సర్కారు వారి పాట” 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.