ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన లావా జడ్91

330
lava-z91-smart-phone-launched

దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ లావా తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్91ను కొంత సేపటి క్రితమే విడుదల చేసింది. లావా జడ్ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే కాగా ఇందులో యూజర్లకు పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి. 5.7 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఇందులో ఏర్పాటు చేశారు. ఫోన్‌ను ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో మాత్రమే కాకుండా ముందు భాగంలో ఉన్న కెమెరాతో ఫేస్ అన్‌లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ను కొనే వారికి ఎయిర్‌టెల్ రూ.2వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది.


లావా జడ్91 ఫీచర్లు…

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.