ఫోర్బ్స్ “30 అండర్ 30” జాబితాలో కీర్తి సురేష్

231
Keerthy Suresh in Forbes India's 30 Under 30 List

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మేగజైన్ జాబితాలో చోటు సంపాదించింది కీర్తి సురేష్.

ఫోర్బ్స్ ఇండియా తన 2021 వార్షిక జాబితాను ’30 అండర్ 30′ పేరుతో తాజా జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 30 ఏళ్లలోపు దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, నిపుణులు, కళాకారులు తదితరులు ఉన్నారు.

ఎంటర్టైన్మెంట్ విభాగంలో కీర్తి సురేష్ చోటు దక్కించుకున్నారు. కీర్తి సురేష్ తనకు ఈ ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మేగజైన్ జాబితాలో చోటు దక్కించుకున్నందుకు గర్వంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫోర్బ్స్ ఇండియా సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

కాగా ఫోర్బ్స్ ఇండియా ’30 అండర్ 30′ జాబితాలో మరో నటి ‘బుల్బుల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీ ఎలైట్, యూట్యూబర్ ఆశిష్ చంచలాని కూడా ‘డిజిటల్ కంటెంట్ క్రియేటర్’ విభాగం కింద ఫోర్బ్స్ లో చోటు దక్కించుకోవడం విశేషం.