యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న చిత్రం “ఇప్పుడు కాక ఇంకెప్పుడు”. ఈ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కిస్తున్నారు.
వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తుండగా.. చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు.
చిత్రంలో హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు.
షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్లే టీజర్‌లో షార్ట్ టర్మ్ రిలేషన్స్, రిలేషన్ విత్ బెనిఫిట్స్ అంటూ రొమాంటిక్ సీన్స్ ను చూపించారు.
‘నచ్చినంత వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడమే’ అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ హైలైట్ అవుతోంది.
చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీనే ఈ సినిమా కథాంశం అని టీజర్ ద్వారా తెలుస్తోంది.
మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.