ఈ రోజు కొత్తిమీర వ్యతిరేక దినమంట‌

258

అంత‌ర్జాతీయంగా చాలా రోజులు ఉన్నాయి. ఎయిడ్స్ డే, మ‌ద‌ర్స్ డే, ఫాద‌ర్స్ డే, చిల్ట్ర‌న్స్ డే.. ఇలా ఎన్నో డేలు ఉన్నాయి. అన్ని పాజిటివ్ డేసే.

కానీ వ్య‌తిరేక దినాన్ని ఎప్పుడైన విన్నారా? ఇదిగో ఇక్క‌డుంది. ఈ రోజు కొత్తిమీర వ్య‌తిరేక దిన‌మంట‌. కొత్తిమీర ఆరోగ్యానికి మంచిద‌న్న విష‌యం అందరికీ తెలుసు.

కానీ కొత్తిమీర‌ను ఇష్ట‌ప‌డ‌ని వాళ్లు కూడా ఉన్నారు. ఆహారంలో కొత్తిమీర క‌నిపిస్తే దాన్ని ప‌క్కకు తీసి ప‌డేసే వాళ్లున్నారు.

అంతేకాదు కొత్తిమీర క‌నిపిస్తే చాలు కోపంతో ఊగిపోతారు. అందుకే కొత్తిమీర వ్య‌తిరేకులంగా ఒక్క‌టై ఈ ఆకుకూర భ‌యంక‌ర‌మైన‌దంటూ ప్ర‌చారం చేస్తున్నారు.

ఫిబ్ర‌వ‌రి 24ను ఇంట‌ర్నేష‌న‌ల్ ఐ హేట్ కొరియాండ‌ర్ డేగా నిర్వ‌హిస్తున్నారు. ఎందుకు కొత్తిమీర‌ను వ్య‌తికిస్తున్నార‌ని వీళ్ల‌ను అడిగితే… దాని రుచి స‌మాన్లు తొముకునే స‌బ్బులా ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఈ ఏడాది నుంచి కొత్తిమీర‌ను ఆహారంపై గార్నిష్ చేయ‌డం మానేయాల‌ని ఈ ఐ హేట్ కొరియాండ‌ర్ డే నిర్వాహ‌కులు హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌పై ఒత్తిడి తేబోతున్నార‌ట‌.

ఇక‌నుంచి ఆహారంలో కానీ, వాటి మీద కానీ కొత్తిమీర వేయొద్ద‌ని దాని వ‌ల్ల తాము అల‌ర్జీకి గుర‌వుతున్నామ‌ని నిర్వాహ‌కులు అంటున్నారు.

డీకిన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ న్యూట్రిషన్ సైన్సెస్‌‌‌కు చెందిన ఆహారం, ఇంద్రియ శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ రస్సెల్ కీస్ట్ ఈ కొత్తిమీర వ్య‌తిరేక‌త‌పై స్పందిస్తూ..

‘కొత్తిమీరను ఇష్టపడం లేదా వ్యతిరేకించడంలో జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయి. మన ముక్కులో ఉండే వాసన గ్రాహకాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా స్పందిస్తాయి.

కొందరికి కొత్తిమీర వాసన కమ్మగా అనిపిస్తే, మరికొందరికి వెగటు పుట్టిస్తుంది. అందుకే, చాలామంది కొత్తిమీరను తమ ఆహారంలో తినేందుకు ఇష్టపడరు’ అని తెలిపారు.

మూడేళ్ల కిందట ఫేస్‌బుక్‌లో ‘I Hate Coriander’ పేజ్‌ను మొదలుపెట్టారు. అది క్రమేనా కోట్లాది కొత్తిమీర వ్యతిరేకులను సంపాదించింది.

చివరికి ఫిబ్రవరి 24వ తేదీని అధికారికంగా ‘అంతర్జాతీయ కొత్తిమీర వ్యతిరేక దినం’గా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘మా బలం ఇప్పుడు చాలా పెరిగింది.

ప్రపంచ జనాభాలో కొత్తిమీరను వ్యతిరేకించేవారి సంఖ్య సుమారు 10 శాతం ఉంటుంది. ఇకపై ప్రపంచంలో ఏదైనా రెస్టారెంట్ తమ వంటకాల్లో కొత్తిమీర వేసినట్లయితే తప్పకుండా ఆ విషయాన్ని మెను కార్డులో తెలపాలనేది మా డిమాండ్.

అయితే కొత్తిమీరను ఉపయోగించవద్దని మేము చెప్పడం లేదు. దాన్ని మీరు వంటకాల్లో వాడితే కస్టమర్లకు ముందుగా చెప్పాలని మాత్రమే కోరుతున్నాం.

ఎందుకంటే రెస్టారెంట్లకు వెళ్లే అందరికీ కొత్తిమీర ఇష్టం ఉండకపోవచ్చు’ అని తెలిపారు.

కొత్తిమీర అంటే మాకు ఇష్ట‌మే అన్న వాళ్లు ఒక లైక్ కొట్టి మాకు తెలియ‌జేయండి.