మీ వాట్సప్.. హ్యాకర్‌ల బారిన పడకుండా ఉండాలంటే…

360

చాలా రోజుల నుంచి సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్ని ఆంశాల్లో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా మ‌ళ్లీ మ‌ళ్లీ ఈ హ్యాక‌ర్లు దాడులు చేస్తూనే ఉన్నారు.

గొప్ప గొప్ప వాళ్ల బ్యాంక్ అకౌంట్ల‌పై దాడులు చేసిన ఈ హ్యాక‌ర్లు ఇప్పుడు సామాన్యుడి మీద ప‌డ్డారు. వాట్సాప్‌ను హ్యాకింగ్ చేసి డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నారు.

త‌ప్పుడు మెసేజ్‌ల‌తో వాట్సాప్‌ను త‌మ ఆధీనంలోకి తీసుకుని జ‌నాల‌ను బెదిరిస్తున్నారు. అనేక మంది యూజ‌ర్లు డ‌బ్బులు కోల్పోయిన సంగ‌తి కూడా మ‌న‌కు తెలుసు.

బ్యాంక్ అకౌంట్లు, మెయిల్స్‌, వెట్‌సైట్స్‌, సోష‌ల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేసే ఈ కేటుగాళ్లు వాట్సాన్ ఎలా హ్యాక్ చేస్తున్నారో తెలీడం లేదు. అందుకే మ‌న జాగ్ర‌త్త‌లో మ‌న‌ముండ‌టం చాలా ముఖ్యం క‌దా.

తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖుల వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్‌కు గుర‌య్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో పలువురికి వాట్సప్ సందేశాలు పంపించి వారి చాట్‌ను హ్యాక్ చేశారు.

ఈ బాధితుల్లో పలువురు సెలబ్రిటీలు, డాక్టర్లు ఉన్నారు. సైబర్‌ నేరగాళ్లు వారి కాంటాక్ట్‌లో ఉన్న నంబర్ల నుంచి మెసేజ్‌లు పంపించి, ‘ఎమర్జెన్సీ హెల్ప్‌’ అంటూ సిక్స్ డిజిట్ కోడ్‌తో ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తారు.

త‌ర్వాత ఆ సెల్‌ఫోన్‌లోని చాట్‌ను హ్యాక్ చేస్తారు. తొలుత ఒక వ్యక్తి వాట్సాప్ ఖాతా హ్యాక్ అవుతుంది. ఆ తర్వాత ఆ మొబైల్ నెంబర్ నుంచి అతడి ఫ్రెండ్ లిస్టులో ఉన్న వారందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది.

మీకు పొరపాటున ఆరు అంకెల కోడ్‌ను పంపాను. ఆ కోడ్‌ను తిరిగి పంపించండి ప్లీజ్. చాలా అర్జెంట్ అని ఒక‌ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత కాంటాక్ట్స్‌లోని వారందరి ఫోన్లకు SMS వస్తుంది.

అందులో ఆరంకెల కోడ్‌తో పాటు ఒక లింక్ కూడా ఉంటుంది. ఆ కోడ్‌ను వాట్సాప్ ద్వారా పంపించినా.. లింక్ క్లిక్ చేసినా.. మీరు ఆ హ్యాక‌ర్ చేతికి దొరికిన‌ట్టే. హ్యాక‌ర్స్‌కు దొర‌క‌కుండా ఉండేందుకు ఒక ఉపాయం ఉంది.

వాట్సాప్‌ను సెటప్ చేస్తున్నప్పుడు సిమ్ కార్డును ధృవీకరించే కోడ్ మీకు లభిస్తుంది. ఆ OTP మీకు SMS ద్వారా లేకపోతే.. వాట్సాప్ లేదా కాల్ ద్వారా వస్తుంది.

అంతేకాకుండా వాట్సప్ పాస్‌వ‌ర్డ్‌ పెట్టుకోవడం ద్వారా మీరు హ్యాకింగ్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

పాస్‌వ‌ర్డ్‌ ఎలా పెట్టుకోవాలంటే.. మొదటగా.. WhatsApp Settings ఓపెన్ చెయ్యండి. అందులో Accountలోకి వెళ్లండి. Two-step verification ఓపెన్ చేసి Enable అనే దానిపై క్లిక్ చేసి.. ఆరు అంకెల నెంబర్ పెట్టుకోవాలి.

మ‌రోసారి ఆ నంబ‌ర్‌ను టైప్ చేయ‌మ‌ని అడుగుతుంది. ఆ నంబ‌ర్‌ను మ‌రోసారి టైప్ చేసి సేవ్ బ‌ట‌న్‌ను నొక్కంది. దీనికి ఈ-మెయిల్ అడ్రెస్‌కు కూడా యాడ్ చేసుకోవచ్చు.

లేకపోతే వదిలేయవచ్చు. ఈ విధంగా మీ వాట్సప్ అకౌంట్‌ను హ్యాకర్‌ల భారిన పడకుండా జాగ్ర‌త్త‌గా ఉంచుకోవ‌చ్చు.