పీడీఎఫ్‌ ఫైల్‌ ని ఎలా ఎడిట్ చేయాలో తెలుసా?

411
how to edit pdf file

స్మార్ట్‌ఫోన్‌లో ఈ పేపర్స్‌ చూడాలన్నా, ఈ పుస్తకాలు చదవాలన్నా, షేర్‌ చేసుకోవాలన్నా పీడీఎఫ్‌ కావాల్సిందే. అయితే చాలా సందర్భాల్లో ఆ ఫైల్‌లో మార్పులు చేర్పులు చేయాలంటే ఏం చేయాలో అర్థం కాదు. అందుబాటులో ఉండే పీడీఎఫ్‌ రీడర్స్‌తో మార్పులు చేయలేము. అలాంటప్పుడు పీడీఎఫ్‌ ఫైల్స్‌ ఎడిట్‌ చేసే మొబైల్‌ అప్లికేషన్స్‌ అవసరమవుతాయి. వాటిలో మెరుగైన ఆప్షన్లు, ఫీచర్స్‌ ఉన్న ఒక యాప్‌ గురించి తెలుసుకుందాం..

ఫైల్‌ మేనేజర్‌లా..
దీనితోపాటు గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌ బాక్స్‌లకు కూడా సింక్‌ చేసుకొని అక్కడి ఫైల్స్‌ కూడా ఓపెన్‌ చేసుకోవచ్చు. ఫైల్‌ మేనేజర్‌ తరహాలో ఫైల్స్‌ పేరు మార్చుకోవడం, కాపీ, మూవ్‌, డిలీట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒకే సారి ఫైల్స్‌ చూసే విధానాన్ని కూడా మార్చుకోవచ్చు. అంటే గ్రిడ్‌ మోడ్‌లో లేదా థంబ్‌నెయిల్‌లా కూడా పెట్టుకోవచ్చు. పీడీఎఫ్‌ రీడర్‌లా కూడా చాలా ఫీచర్సే ఉన్నాయి. నైట్‌ మోడ్‌, ఫుల్‌మోడ్‌ వంటి వాటిలో చూడొచ్చు.



XODO పీడీఎఫ్‌ ఎడిటర్‌..
ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లో లభిస్తుంది. దీని ద్వారా ఎదైన పీడీఎఫ్‌ ఫైల్‌లో ఏదైన పేజీని యాడ్‌ చేసుకోవాలన్న, ఉన్న పేజీల్లో ఒకటి తీసేయాలన్న చేయొచ్చు. దానితోపాటు ఏదైన పేజీ అడ్డంగా ఉంటే దాన్ని సరిచేసేలా రొటేషన్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. అంటే ఆ పేజీని కుడి నుంచి ఎడమకు, లేదా పూర్తిగా తలకిందులు చేసుకోవచ్చు. పేజీల అమరికపైనా మార్పులు చేసుకోవచ్చు. రెండో పేజీని తీసుకెళ్లి పదో పేజీ కింద పెట్టొచ్చు. ఇలా పేజీలలో ఎలాంటి మార్పులు కావాలన్న సులభంగా చేసుకోవచ్చు. రెండు పీడీఎఫ్‌ పైల్స్‌ని కలిపి ఒకటిగా కూడా చేసుకోవచ్చు. ఏవైన ఫొటోలను కావాల్సినవి కలిపి పీడీఎఫ్‌ ఫైల్‌గా మార్చుకోవచ్చు. అలా ఎన్నిటిని కలిపైనా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి లిమిట్‌ లేదు. ఉన్న పీడీఎఫ్‌లలో ఏదైన పేజీని నచ్చిన సైజ్‌ వరకు క్రాప్‌ కూడా చేయొచ్చు.

టెక్ట్స్‌ ఎడిటింగ్‌
పీడీఎఫ్‌ అనగానే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇమేజ్‌ రూపంలో ఉండే జేపీజీ ఫైల్స్‌ని పీడీఎఫ్‌గా మార్చండం, లేద ఏదైన టెక్ట్స్‌ ఫైల్‌ని పీడీఎఫ్‌లో పెట్టుకోవడం. నాన్‌ యూనికోడ్‌ ఫాంట్స్‌ అన్ని కంప్యూటర్లు, ఫోన్లలో ఓపెన్‌ అయ్యేందుకు పీడీఎఫ్‌గా మారుస్తూ ఉంటారు. అలాంటి టెక్ట్స్‌ ఉన్న పీడీఎఫ్‌లను కావాల్సిన చోట లైన్లను నచ్చిన కలర్స్‌తో హైలెట్‌ చేసుకోవచ్చు, ఆ వాక్యాల కింద గీత గీసుకోవచ్చు, ఏవైన బాణం గుర్తులు, సర్కిళ్లు గీయొచ్చు, నచ్చిన పేరా దగ్గర కావాల్సిన కొటేషన్లు, సంబంధిత వివరాలు మనం ప్రత్యేకంగా రాసుకోవచ్చు. అన్నిటి కన్నా ముఖ్యమైన ఆకర్షణీయమైన అవకాశం కూడా ఇచ్చారు. ఎవరికైనా మనం సీవీ పంపితే వివరాలు అన్ని టైప్‌ చేసిన సంతకం పెట్టాలంటే కుదరదు, కేవలం ప్రింట్‌ తీసుకునే దానిపై సంతకం పెట్టాల్సి ఉంటుంది. కాని ఈ యాప్‌ ద్వారా సంతకం కూడా మన ఫోన్‌ స్ర్కీన్‌పైనే చేసుకోవచ్చు.

ఇది కావాలంటే..
ఈ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఉపయోగించే వారు https://goo.gl/cd39tm ఈ లింక్‌ క్లిక్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోండి. అదే ఐఓఎస్‌(యాపిల్‌ ఫోన్‌) వాడేవారైతే https://goo.gl/jSZqkt ఈ లింక్‌ ద్వారా ఇన్‌స్టాల్‌ చేసుకోండి. లింక్‌లోని పెద్ద అక్షరాలు అలాగే టైప్‌ చేయాలి.



-రాజేష్‌ పెదమళ్ల సౌజన్యం తో