రైల్వేస్టేషన్‌లో వైఫై ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసా

564
how-to-connect-wifi-on-railway-station

రైల్వేస్టేషన్ల పరిధిలోకి వచ్చిన వెంటనే మొబైల్‌లో వైఫై నెట్‌వర్క్ సిగ్నల్ వస్తుంది. అందులో రైల్‌వైర్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిని ఓకే చేయగానే ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలని అడుగుతుంది. నంబర్ ఎంటర్ చేస్తే.. వన్ టైం పాస్‌వర్డ్ డిస్‌ప్లే అవుతుంది. దీనిని ఎంటర్ చేస్తే వెంటనే వెల్‌కం వైఫై అంటూ డిస్‌ప్లేలో చూపిస్తుంది. దాంతో మొబైల్ వైఫైకి కనెక్టు అయినట్లే.



దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 742 రైల్వేస్టేషన్లున్నాయి. ఇందులో ఏ-1 స్టేషన్లను గుర్తించి వైఫై సౌకర్యాన్ని అంచెలంచెలుగా ఏర్పాటుచేస్తున్నారు. 45 రూరల్ రైల్వేస్టేషన్లలో, 40 అర్బన్ స్టేషన్లలో ఇప్పటికే సేవలందుతున్నాయి. ప్రధానంగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వరంగల్, నిజామాబాద్, బాసర, మహబూబాబాద్, గుంతకల్, రేణిగుంట, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, ఔరంగాబాద్ తదితర రైల్వేస్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు మరో 15 స్టేషన్లను గుర్తించి వాటిలో కూడా ఈ సదుపాయం కల్పిస్తారు. ఇవేకాకుండా దేశవ్యాప్తంగా ఏ-1, ఏబీ-1 స్టేషన్లు 500 వరకు ఉన్నాయి. వీటిల్లో కూడా వైఫై సేవలు అందించేందుకు ఇండియన్ రైల్వే ప్రతిపాదించింది.