ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

757
ap-inter-second-year-results-out

ఏపీ ఇంటర్‌మీడియట్ సెకండర్ ఇయర్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారని ఆయన అన్నారు. ఎంపీసీలో తేజ(992) మొదటి ర్యాంకు తెచ్చుకోగా, ఆప్రాన్(991), సుష్మ(990) రెండు, మూడు ర్యాంకులను సాధించారు. బైపీసీలో బాలికలే మొదటి మూడు ర్యాంకులు సాధించారని, దీక్షిత (990), లక్ష్మీకీర్తి (990), కురుబ షిన్యత (990) మార్కులతో టాప్‌లో నిలిచారన్నారు. అలాగే సీఈసీలో గీత(968) ప్రథమ స్థానం, ఎస్‌ఆర్ ప్రియ(966) రెండవ స్థానం, శివరాం(964) మూడవ ర్యాంకు సాధించారు. వీటితో పాటు ఎంఈసీలో నిశాంత్ కృష్ణ(992) ఫస్ట్ ర్యాంక్, మీనా(981) రెండో స్థానం, నాగ వెంకట అభిషేక్(981) మూడో స్థానం తెచ్చుకున్నారు. 

84శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానం…, 77శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా రెండో స్థానం…, 76శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా మూడో స్థానం…, 59శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచిందని మంత్రి గంటా తెలిపారు. మొత్తం 44 వెబ్‌సైట్లలో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు మంత్రి వెల్లడించారు.