ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్ విడుదలైంది. ఫస్టియర్ పరీక్షలను మే 14-22 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలను మే 14-22 వరకు సాయంత్రం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం రాజమహేంద్రవరంలో షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 29న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరుగుతుందన్నారు. ప్రాక్టికల్ పరీక్షలను మే 23-27 వరకు నిర్వహిస్తామని తెలిపారు.