నేటినుంచి హైదరాబాద్‌ ఫెస్ట్‌

415
Hyderabad fest 2018 from today

ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ నెల 13న హైదరాబాద్‌ ఫెస్ట్‌ – 2018 ప్రారంభం కానుంది. దీనిని విజయవంతం చేయాలని ఫెస్ట్‌ కమిటీ నేతలు గురువారం సాయంత్రం ఎన్టీఆర్‌ స్టేడియంలో ఎయిర్‌ బెలూన్‌ను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఫెస్ట్‌ కమిటీ కోశాధికారి ఎ.నాగేశ్వర్‌రావు, కార్యదర్శి కె.చంద్రమోహన్‌, సభ్యులు వేణుగోపాల్‌, ఇందిర, హిమబిందు, ఖయ్యూం, కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ శుక్రవారం సాయం త్రం 5గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో వినోద విజ్ఞాన సంబరాలతో కూడిన హైదరాబాద్‌ ఫెస్ట్‌ ను ప్రారంభిస్తున్నామన్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, అల్లం నారాయణ, చుక్కా రామయ్య దీనిని ప్రారంభిస్తారన్నారు. ఈ ఫెస్ట్‌లో కల్చరల్‌ ఫెస్ట్‌, బాలోత్సవ్‌, సైన్స్‌ ఫెయిర్‌, బుక్‌ ఫెయిర్‌, సృజనస్వరం, ఫొటోఫెస్ట్‌, షార్ట్‌ ఫిలిం ఫెస్ట్‌, ఫుడ్‌కోర్ట్‌, ఉర్దూ కల్చరల్‌ ఫెస్ట్‌ వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.