హీరో రాజ్ తరుణ్ తండ్రికి జైలు శిక్ష

537
hero raj-taruns-father-sentenced-jail

విశాఖపట్నం: నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి రుణం పొందిన కేసులో సినీ నటుడు రాజ్ తరుణ్ తండ్రి బసవరాజుకు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అయితే 2013లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో స్పెషల్ అసిస్టెంట్‌ క్యాషియర్‌గా విధులు నిర్వహించే బసవరాజు.. అప్పట్లోనే తన భార్య రామలక్ష్మితో పాటు పలువురి పేర్ల మీద నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి రూ.9.85లక్షల రుణాన్ని తీసుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు బ్యాంకు అధికారులు ఆడిట్ తనిఖీలు చేశారు. నకిలీ బంగారం బయటపడటంతో బ్యాంకు మేనేజర్ గరికిపాటి సుబ్రమణ్యం గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంరం బసవరాజును నిందితుడిగా పేర్కొంటూ మూడేళ్ల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.