“మైదానంలో ఆడితే ఆట… బయట ఆడితే వేట…” విజిల్స్ వేయిస్తున్న సీటీమార్ టీజర్

222
Gopichand's Seetimaarr Movie Teaser Released

మ్యాచో స్టార్ గోపీచంద్, మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ కాంబోలో రాబోతున్న విలక్షణ కథాంశం “సీటీమార్”.

కబడ్డీ ఆట నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్.

ఒక నిమిషం 12 సెకనుల నిడివితో ఉన్న ఈ టీజర్ “కబడ్డి.. కబడ్డి.. కబడ్డి.. అండ్ యువర్ కౌంట్‌ డౌన్ బిగిన్స్ నౌ” అంటూ విలన్ చెప్పే డైలాగ్‌తో స్టార్ట్ అయ్యింది.

టీజర్ లో “కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట… బయట ఆడితే వేట…” అంటూ గోపీచంద్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ విజిల్స్ వేయిస్తోంది.

ఇక ఇందులో కబడ్డీ మైదానాలు, కోచ్‌లుగా తమన్నా, గోపీచంద్ లుక్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.

మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

ఈ చిత్రంలో గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించింది. హాట్ బ్యూటీ అప్సరా రాణి ఐటెం సాంగ్ చేసింది.

రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలు జోడించి ఈ ‘సీటీమార్’ మూవీ రూపొందిస్తున్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్.

గతకొంతకాలంగా సరైన హిట్ లేని గోపీచంద్ ఈ సినిమాతో ఎలాగైన బ్లాక్‌బస్టర్ ను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో నటిస్తున్నారు. ఇక ఈ ఏడాది విడుదలైన సినిమాలు దాదాపుగా మంచి విజయాన్నే సాధిస్తున్నాయి.

రవితేజ, అల్లరి నరేష్ లకు కలిసొచ్చినట్లుగానే గోపీచంద్ కు కూడా ఈ ఇయర్ కలిసి వస్తుందేమో చూడాలి.