“పక్కా కమర్షియల్”గా గోపీచంద్, మారుతీ చిత్రం

226
Gopichand and Maruthi film titled Pakka Commercial

మ్యాచో హీరో గోపీచంద్ తదుపరి చిత్రం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందనుంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. జేక్స్‌బిజోయ్ సంగీతం సమకూర్చుతుండగా.. ఎస్‌కేఎన్ సహనిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్లడిస్తామని అంటోంది చిత్రయూనిట్.

తాజాగా ఫిబ్రవరి 14న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ చిత్ర టైటిల్ కూడా రివీల్ చేశారు. “పక్కా కమర్షియల్” అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది.

ఈ “పక్కా కమర్షియల్” మూవీ షూటింగ్ మార్చి 5వ తేదీ నుండి జరగనుందని డైరెక్టర్ మారుతి ప్రకటించారు.

గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు మేకర్స్.

ఇక గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో “సీటిమార్” చిత్రంలో నటిస్తున్నారు.