రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున నిరుద్యోగులకు శుభవార్త..!!

643
good news to unemployees on june 2nd

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ( జూన్ 2 ) వచ్చేసింది.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపేందుకు సిద్దమవుతుంది. పెద్దఎత్తున కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతున్నది.అందులోభాగంగానే దాదాపు నాలుగు నుంచి ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసి సుమారు మూడువేల వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్ధమైంది టీఎస్‌పీఎస్సీ . మూడువేల ఉద్యోగాల్లో రెండువేల పోస్టులను ఇప్పటికే ఖరారుచేయగా, మరో వెయ్యి పోస్టులను నోటిఫికేషన్లలో చేర్చనున్నట్టు తెలిసింది. ఈ కొలువుల్లో ప్రధానంగా సాధారణ డిగ్రీ అర్హత కలిగినవే అధికంగా ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.



 

అయితే ఈ ప్రకటనల ద్వారా నింపే ఉద్యోగాల ప్రక్రియను కొనసాగిస్తూనే.. మరోవైపు పెండింగ్ పోస్టుల భర్తీని పూర్తిచేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే నోటిఫికేషన్ల విడుదలకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇందులో గ్రూప్- 4 కొలువులు 1300-1500, వీఆర్వో -700, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్- 450, గ్రూప్-1లో 125 ఖాళీలు ఉండనున్నట్టు సమాచారం. ఆర్టీసీలో 70 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్టు తెలిసింది.జూన్ 2న ప్రకటన విడుదల చేసి ప్రిలిమినరీ-మెయిన్స్, మౌఖిక పరీక్షలను వచ్చే మార్చినాటికి పూర్తిచేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నట్టు తెలిసింది.