
చికెన్‌ను చూస్తే నోట్లో నీళ్లూరుతాయి. రెస్టారెంట్స్‌లో రకరాకల చికెన్ ఐట్సమ్ ఉంటాయి. ఎంత ధర పెట్టయినా కొంటుంటాం.
కొంత మందికి చికెన్ లేనిదే ముద్ద దిగదు. కానీ ఈ విషయం తెలిస్తే చికెన్ ముక్క ముట్టనే ముట్టరు.
మనం తినే చికెన్‌లో మూడొంతులకు గాను రెండొంతులు యాంటీ బయాటిక్ రెసిస్టెంట్ అయిన ఇకోలీ బాక్టీరియా ఉంటుందని తాజా పరిశోధనలు తేల్చాయి.
షాపుల నుంచి తెచ్చిన చికెన్‌లో ఉండే ఇకోలీ బాక్టీరియా వల్ల కడుపు ఉబ్బరం, డయేరియా, వాంతులు వంటి ఉదర సంబంధ వ్యాధులు సోకే ప్రమాదముందట.
ఒక్కోసారి ఈ సూపర్ బగ్ వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదముందని అంటున్నారు. ఇకోలి బగ్‌పై ఇంగ్లాండ్ మార్కెట్‌లో జరిపిన సర్వేలో ఏటా ఐదువేలకు పైగా మరణాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు.
ఇంగ్లండ్‌లో అమ్మే మూడొంతుల చికెన్‌లో రెండొంతులు ఇకోలీ సూపర్ బగ్ సోకినదే అంటున్నారు నిపుణులు.
గతంతో పోలిస్తే ఇంగ్లాండ్‌లో అమ్మే 78 శాతం కోడిమాంసంలో ఇకోలి అధికంగా ఉందట. సూపర్ మార్కెట్లలో అమ్మే చికెన్‌లో అధిక శాతం ఇకోలి బగ్ సోకిందేనని గుర్తించారు.
ఈ బ్యాక్టీరియా కడుపులోకి వెళితే ఒకేసారి ప్రభావం చూపకుండా శరీరంలో ఏళ్ల తరబడి ఉండిపోవడం వల్ల సెఫలోస్పోరిన్స్ అనే బాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.
దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందట. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ సైంటిస్టులు పేరొందిన మార్కెట్ల నుంచి తెచ్చిన చికెన్‌పై పరిశోధనలు చేశారు. అధిక మొత్తంలో కలుషితమైనట్లు తేలింది.
ఈ పరిశోధనొక్కటే కాదు.. డిపార్ట్‌మెంట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, ఫుడ్ అండ్ రూరల్ అఫైర్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తదితర ప్రభుత్వ శాఖలు కూడా ఇంగ్లండ్ల్‌లో దొరికే చికెన్లో అధిక శాతం చికెన్ ఇకోలి బగ్ కలిగిందేనని తేల్చారు.
అతిగా ఇకోలి బాక్టీరియా సోకిన చికెన్ తింటే భారీ మూల్యం చెల్లించాల్సిందేనంటున్నాయి పరిశోధనలు.
అదే విధంగా అతిగా యాంటీ బయాటిక్స్ వాడకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు.
పౌల్ట్రీ రంగంలో ఒక రోజు వయసున్న కోడిపిల్లకు అడ్వాన్స్డ్ సెఫలో స్పోరిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతో ప్రమాదకారి అని హెచ్చరించినా వెటర్నరీ మెడిసిన్స్ డైరెక్టరేట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.
కోళ్లలోనే ఇకోలీ బగ్ ఎందుకు వృధ్ది చెందుతుందంటే.. పౌల్ట్రీ రంగంలోనే అతిగా యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు. అందుకే పౌల్ట్రీ చికెన్‌లోనే ఇకోలీ బాక్టీరియా అధికంగా చేరుతుంది.