మేడారం మినీ జాతరలో పాజిటివ్‌ కేసులు..!

183
Positive cases at Medaram Mini Fair

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ఈ నెల 24న సాంప్రదాయబద్దంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ నెల 27 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు భక్తులు పోటెత్తారు. ఈ జాతరకు వెళ్లి వచ్చారా.. అయితే ఒకసారి కరోనా టెస్టులు చేయించుకోవడం మంచిది.

ఎందుకంటే ఈ మినీ జాతరలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి.

తాజాగా ముగ్గురు దేవాదాయశాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరికొంత మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి.

దీంతో వారిని క్వారంటైన్‌లో ఉంచాలని అధికారులు సూచించారు. మరోవైపు, కరోనా కేసులతో అప్రమత్తమైన అధికారులు.. భక్తుల రక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటున్నారు.

ఇదే సమయంలో సిబ్బందికి పాజిటివ్‌గా తేలడంతో వారిని హోం ఐసోలేషన్‌లో పెట్టారు.

వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.