సుకుమార్‌తో మహేష్‌ సినిమా ఆగిపోయినట్టే

579
sukumar movie

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు, ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన వన్‌ నేనొక్కడినే కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోయినా స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మంచి పేరు వచ్చింది. దీంతో మరోసారి ఇదే కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.




 

‘రంగస్థలం’ లాంటి హిట్ ఇచ్చిన సుకుమార్ తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయడానికి ప్రయత్నాలు చేసాడు సుకుమార్. ఆల్ మోస్ట్ సినిమా కన్ ఫార్మ్ అయినట్టే, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లిపోతుందని భావిస్తున్న తరుణంలో ”క్రియేటివ్ డిఫరెన్సెస్స్ వల్ల సుకుమార్ దర్శకత్వంలో నేను చేయాల్సిన సినిమా ఆగిపోయింది. ఆయన కొత్త సినిమా ప్రకటించారు. ఆల్ ది బెస్ట్. మా ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘1 – నేనొక్కడినే’ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేసాను” అని మహేష్ బాబు ట్వీట్ చేసాడు.

ఈ ట్వీట్ అందరినీ షాక్ కి గురి చేసింది. అసలు ఎందుకు ఈ ఇద్దరి సినిమా ఆగిపోయిందని జనాలు మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు స్వయంగా ‘క్రియేటివ్ డిఫరెన్స్’ అని చెప్పాడు కాబట్టి దీని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సుకుమార్ ఆల్ మోస్ట్ 3 స్టోరీ లైన్స్ మహేష్ బాబుకి చెప్పాడట. ఈ మూడు కూడా మహేష్ బాబుకి నచ్చలేదని సమాచారమ్. ఏదేమైనా ఇప్పటికైతే మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ సినిమా ఆగిపో్యింది. మరి భవిష్యత్తులో వీరి కాంబినేషన్ సినిమా వర్కవుట్ అవుతుందేమో వేచిచూద్దాం.

 

 





మహేష్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోవటంతో వెంటనే సుకుమార్ మరో సినిమాను ప్రకటించాడు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు సుకుమార్‌. గతంలో వీరి కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య2 సినిమాలు తెరకెక్కాయి. ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కబోయే హ్యాట్రిక్‌ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్న బన్నీ ఆ సినిమా తరువాత సుకుమార్ సినిమాలో నటించనున్నాడు.