కాంటాక్ట్ లెస్ పేమెంట్ డివైజ్

538

మామూలుగా క‌రెంట్ బిల్లుగానీ లేదా ఇంటి ప‌న్ను లేదా బ్యాంక్ నెల‌స‌రి వాయిదా వంటి వాటిని క‌ట్టాలంటే ఖ‌చ్చితంగా కార్డు లేదా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.

కానీ టెక్నాల‌జీ పెరుగుతోంది. ఎటువంటి కాంటాక్ట్ లేకుండా పేమెంట్ చేయొచ్చు.

అవునండి కాంటాక్ట్ లెస్ పేమెంట్ డివైజ‌ర్‌తో ఎక్కడైనా, ఎవ‌రికైనా పేమెంట్ చేయొచ్చు. కేవలం ఈ వస్తువు ఉంటే చాలు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు బ్యాంకులు వినూత్న ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి.

SBI, ICICI బ్యాంకులు తమ మొబైల్ యాప్ ద్వారా కాంటాక్ట్ లెస్ పేమెంట్లను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా యాక్సిస్ బ్యాంకు ఓ నిర్ణయం తీసుకుంది. కాంటాక్ట్ లెస్ పేమెంట్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంటాక్ట్ లెస్ పేమెంట్ డివైజ్‌లను లాంచ్ చేసింది.

నేరుగా కస్టమర్ల బ్యాంకు అకౌంట్లకు ఈ డివైజ్ లింక్ అయి ఉంటుంది. డెబిట్ కార్డుల్లాగానే ఇవి కూడా పనిచేస్తాయని చెప్పవచ్చు.

థేల్స్ అండ్ ట్యాపీ టెక్నాలజీస్‌తో యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం కుద్చుకుంది. మాస్టర్ కార్డ్ ప్లాట్ ఫామ్‌పై ఈ డివైజ్‌లు అందుబాటులో ఉంటాయి.

యాక్సిస్ బ్యాంకు వేర్ అండ్‌ పే యాక్సెసరీలను బ్యాండ్, కీ చెయిన్, వాచ్ లూప్‌ల రూపంలో అందుబాటులోకి తెచ్చింది.

యూజర్లు పేమెంట్ చేయడానికి స్మార్ట్ ఫోన్లు, వాలెట్లు తీయాల్సిన అవసరం ఉండదు. కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ల కోసం ఈ వేరబుల్ డివైజ్‌లు బాగా పనిచేస్తాయి.

కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్లను ఒకే చెప్పే వ్యాపారుల నుంచి పేమెంట్ చేయవచ్చు. రూ. 5 వేల వరకు చెల్లింపులు చేయవచ్చు.

రూ. 5 వేల కంటే ఎక్కువ పేమెంట్లు చేయాల్సి వస్తే మాత్రం పిన్ నంబర్ అవసరం ఉంటుంది.

POS మెషిన్ దగ్గర ఈ డివైజ్‌ను అలా..ఇలా కదిలించాల్సి ఉంటుంది. ఇక ఈ డివైజ్‌ను రూ. 750కి విక్రయిస్తున్నారు.

అకౌంట్ ఉన్న యాక్సిస్ బ్యాంకు బ్రాంచీల్లో డబ్బులు చెల్లించి వీటిని కొనుక్కోవచ్చు. 10 శాతం CASH BACK ఆఫర్ కూడా ఉంది.