ఛార్మితో విజయ్ దేవరకొండ… ముంబై వీధుల్లో చక్కర్లు…!

296
Charmme Kaur and Vijay Devarakonda enjoying in Liger sets

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఛార్మింగ్ బ్యూటీ ఛార్మితో కలిసి స్కూటీపై షికార్లు కొట్టారు. ఛార్మి స్వయంగా డ్రైవ్ చేస్తూ విజయ్ దేవరకొండతో ఓ రౌండ్ వేసింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఛార్మి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఛార్మి ట్విట్టర్ వేదికగా ఈ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ”విజయ్‌ దేవరకొండకు నా మీద ఎంత నమ్మకం ఉందనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు.

ముంబైలో లైగర్ సెట్స్ షూటింగ్ జరుగుతుండగా వచ్చిన గ్యాప్‌లో ఇలా షికార్లు కొట్టాం” అని పేర్కొంది. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

విజయ్ దేవరకొండ. ‘లైగర్’ షూటింగ్ స్పాట్‌లో ఇలా ఇద్దరూ కలిసి స్కూటీపై షికార్లు కొట్టారు.

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న “లైగర్” మూవీ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో ప్రత్యేకంగా బాక్సింగ్ కు సంబంధించిన శిక్షణ తీసుకున్నారు.

ఈ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది.