బాలుడ్ని మింగేసిన మొసలి.. పొట్ట కోసి బైటకు తీసిన తండ్రి

499

త‌ల్లి ప్రేమ గొప్ప‌దా.. తండ్రి ప్రేమ గొప్ప‌దా అంటే ఏం చెప్ప‌గ‌లం. నీ రెండు క‌ళ్ల‌ల్లో నీకు ఏదంటే ఇష్ట‌మంటే ఏమ‌ని జ‌వాబివ్వ‌గ‌లం.

బిడ్డ‌ల‌ను త‌ల్లిద్రండులిద్ద‌రూ స‌మానంగా ప్రేమిస్తారు. ఓ తండ్రి ప్రేమ‌కు నిద‌ర్శ‌నమే ఈ వార్త‌.

ఇండోనేషియాలో ఓ న‌ది వ‌ద్ద ఆడుకుంటున్న పిల్లాడ్ని ఓ ముస‌లి మింగేసింది.

అది చూసిన తండ్రి నీళ్ల‌ల్లోకి దూకి ఆ మొస‌లి వెంట ప‌డ్డాడు. నీళ్ల‌ల్లో మొస‌లి చాలా బ‌ల‌వంతురాలు.

అయినా ఆ తండ్రి మొస‌లిని నీళ్ల‌ల్లోనే ఒట్టి చేతుల‌తోనే చంపేశాడు.

దాన్ని బ‌య‌టికి ఈడ్చుకొచ్చి క‌డుపు కోసి కొడుకును బ‌య‌టికి తీశాడు.

వివ‌రాల్లోకి వెళితే.. చేపలు పట్టటానికి తండ్రీ కొడుకులు న‌ది ద‌గ్గ‌ర‌కు వెళ్లారు.

నీళ్లలో నుంచి బాలుడ్ని చూసిన మొసలి నెమ్మదిగా వచ్చి అమాంతం కుర్రాడిని నోట కరచుకుని నీళ్లల్లోకి లాక్కుపోయింది.

ఆ తరువాత అమాంతం మింగేసింది. ఇదంతా చూసిన ఆ తండ్రి కొడుకును కాపాడుకోవటానికి ప్రాణాలకు తెగించి ఆ భారీ మొసలి వెంట పడ్డాడు.

నీళ్ల అడుగుకు మునక వేసి గ్రామస్తుల సహాయంతో ఎలాగైతేనేం ఆ భారీ మొసలిని నీళ్లల్లోనే చంపి ఒడ్డుకు లాక్కొచ్చాడు.

ఆ తరువాత ఆ మొసలు పొట్ట కోసి బాలుడ్ని బైటకు తీశారు.

కానీ ఆ మొసలి పొట్టలోకి వెళ్లిపోయిన ఆ బాలుడు మాత్రం ప్రాణాలతో లేడు.

దీంతో ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. ఇండోనేషియాలో జరిగిన ఈ విషాద ఘటన ఆసల్యంగా వెలుగులోకొచ్చింది.

ఇండోనేషియాలోని ఈస్ట్‌ కలిమన్‌తన్‌కు చెందిన దిమస్‌ ముల్కన్‌ సపుత్ర అనే ఎనిమిదేళ్ల బాలుడు గత బుధవారం (మార్చి3, 2021) తండ్రి సుబ్లియాన్షాతో కలిసి చేపలు పట్టడానికి దగ్గరలోని నదికి వెళ్లాడు.

ఇద్దరూ చేపలు పడుతుండగా 26 అడుగుల ఓ పొడవైన మొసలి దిమస్‌పై దాడి చేసింది.

అది గమనించిన సుబ్లియాన్షా మొసలిని కొట్టి కొడుకుని కాపాడుకోవటానికి శతవిధాల యత్నించాడు.

కానీ అప్పటికే మొసలు దిమస్‌ను నోట కరచుకుని నీళ్లల్లోకి లాక్కుపోయింది.

అలా కుర్రాడితో సహా నీళ్ల అడుగుకు వెళ్లిపోయింది. సాధారణంగా మొసలు ఆహారాన్ని నలమలేదు.

దీంతో అది బాలుడ్ని అమాంతం మింగేసింది. కానీ కొడుకు మృతదేహాన్నైనా దక్కించుకోవాలని ఆ తండ్రి సాహసమే చేశాడు.

గ్రామస్తుల సహాయంతో మొసలిని ఎలాగైతేనే చంపి ఒడ్డుకు తీసుకువచ్చారు.

ఆ మొసలిని చూడగానే ఆ తండ్రికి ఆగ్రహం, ఆవేదన పొంగుకొచ్చాయి.

తీవ్ర భావోద్వేగంతో ‘దిమస్‌.. దిమస్‌’’ అంటూ అరవటం మొదలుపెట్టాడు.

ఆ తరువాత ఆ భారీ మొసలు పొట్టను కోసి దిమస్‌ మృతదేహాన్ని బయటకు తీశారు.

కొడుకుని ఆ స్థితిలో చూసిన ఆ తండ్రి గుండెలవిసేలా ఏడ్చాడు.

అనంతరం బాధాతప్త హృదయాలతో గ్రామస్తులంతా కన్నీరు కార్చారు.

దిమస్‌కు కన్నీటి వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా విషాదం నెల‌కొంది.