బెల్లంకొండ శ్రీనివాస్ కు హీరోయిన్ కష్టాలు ?

208
Bollywood Actress Rejects Bellamkonda Srinivas

పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “ఛత్రపతి” బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. జయంతిలాల్ గడ ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన ప్రముఖ బాలీవుడ్ నటి నటించబోతోందని ప్రచారం జరిగింది.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కియారా అద్వానీ, శ్రద్ధా కపూర్, అనన్య పాండే, దిశా పటాని మేనేజర్లను శ్రీనివాస్ సినిమా మేకర్స్ సంప్రదించారట.

కానీ వీళ్లంతా వారి ఆఫర్‌ను తిరస్కరించారని అంటున్నారు. దీంతో ప్రస్తుతం హీరోయిన్‌ను వెతికే పనిలో ఉన్నారట మేకర్స్. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తొలి చిత్రం “అల్లుడు శీను”కు దర్శకుడు వినాయక్. ఇప్పుడు శ్రీనివాస్ బాలీవుడ్‌ ఎంట్రీకి కూడా వినాయక్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం.

“ఖైదీ నెంబర్ 150″తో విజయం అందుకున్న వినాయక్ ఆ తరవాత మరో సినిమా చేయలేదు. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ఏడాది “అల్లుడు అదుర్స్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కానీ ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.