శ్రీవిష్ణు “భళా తందనాన” సినిమా ప్రారంభం

186
Bhala Thandanana movie launched today

వారాహి చలన చిత్రం బ్యానర్‌పై విలక్షణ నటుడు శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా “భళా తందనాన’”.

రజనీ కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా మంగళవారం ప్రారంభమైంది. ఈ సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

‘భళా తందనాన’ సినిమాను మంగళవారం పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభించారు.

ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత, శ్రీశైల దేశస్థానం మాజీ ప్రధాన సలహాదారు పురాణ‌పండ శ్రీ‌నివాస్ క్లాప్ నివ్వగా, ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కెమెరా స్విచ్చాన్ చేశారు.

స్క్రిప్టును శ్రీ‌వ‌ల్లి (కీర‌వాణి స‌తీమ‌ణి), ర‌మ (రాజ‌మౌళి స‌తీమ‌ణి) సంయుక్తంగా అందించారు. ఈ పూజా కార్యక్రమంలో హీరో నారా రోహిత్‌, నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది పాల్గొన్నారు.

మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేథరిన్ త్రెసా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇక ‘కె.జి.యఫ్’లో గరుడగా నటించి మెప్పించిన రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా రచయితగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.