వారాహి చలన చిత్రం బ్యానర్‌పై విలక్షణ నటుడు శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా “భళా తందనాన’”.
రజనీ కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా మంగళవారం ప్రారంభమైంది. ఈ సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.
‘భళా తందనాన’ సినిమాను మంగళవారం పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభించారు.
I’m Super Excited to Kickstart this one #BhalaThandanana.
To be directed by One of my favorite directors @chaitanyahead in @VaaraahiCC!
Music by #Manisharma sir 😍https://t.co/qGYKSyMn5w@CatherineTresa1 @GarudaRam @SaiKorrapati_ pic.twitter.com/fJZrlZet9C— Sree Vishnu (@sreevishnuoffl) February 16, 2021
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత, శ్రీశైల దేశస్థానం మాజీ ప్రధాన సలహాదారు పురాణపండ శ్రీనివాస్ క్లాప్ నివ్వగా, ఎస్.ఎస్.రాజమౌళి కెమెరా స్విచ్చాన్ చేశారు.
స్క్రిప్టును శ్రీవల్లి (కీరవాణి సతీమణి), రమ (రాజమౌళి సతీమణి) సంయుక్తంగా అందించారు. ఈ పూజా కార్యక్రమంలో హీరో నారా రోహిత్, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు.
మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేథరిన్ త్రెసా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇక ‘కె.జి.యఫ్’లో గరుడగా నటించి మెప్పించిన రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా రచయితగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.