బుల్లి తెరపై చాలా మంది యాంకర్లు ఉన్నారు. కానీ తక్కువ సమయంలో మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు.
తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యే ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా విడుదలై సక్సెసైంది.
ప్రదీప్ నిర్వహించే ఏ షోలోనైనా నవ్వులకు ఢోకా లేదు. తెలుగు బుల్లి తెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ప్రదీపే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ప్రతి షోలో ప్రదీప్ పెళ్లి గురించి కామెంట్స్ వినిపిస్తుంటాయి. స్టార్ మా ఛానల్ వాళ్లు ప్రదీప్ కోసం ఏకంగా స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు.
ఇతని కోసం పెళ్లి చూపులు అనే కార్యక్రమాన్ని రూపొందించారు. కానీ అది ఫ్లాప్ అయింది. అది వేరే విషయం.
కానీ ప్రదీప్ పెళ్లి కోసం ఓ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం విశేషం. ప్రదీప్ పెళ్లి టాపిక్‌పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
మొన్నటికి మొన్న సరెగమపా అనే షోలో కూడా ప్రదీప్ పెళ్లి గురించి పెద్దలు ప్రస్తావించారు. అతనికి సెటైర్లు పడుతూనే ఉన్నాయి. అంతేకాదు ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమా ప్రమోషన్‌కు వచ్చినప్పుడు కూడా ఈ యాంకర్‌ను పెళ్లి గురించి అడిగారు.
ఆ మధ్య ఆలీతో సరదాగా షోకు వచ్చిన ప్రదీప్‌తో ఆలీ ఓ ఆటాడుకున్నారు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా? అని ఆలీ అడిగితే.. సోనాలీ బింద్రే అంటూ ప్రదీప్ సరదా సమాధానమిచ్చాడు.
దానికి నవ్విన ఆలీ అసలు పేరు చెప్పమన్నాడు. అందుకు ప్రదీప్ సామాధానమిస్తూ.. ఎందుకు సార్ ఇప్పుడు ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలకు కూడా తల్లి అయ్యుంటుంది.
సోనాలీ ఈ షో చూస్తుంటుందని ఆలీ క్లారిటీ ఇచ్చారు. అంటే సరదాగా సమాధనమిచ్చినప్పటికీ ప్రదీప్‌కు గతలో లవర్ ఉండేదని చెప్పకనే చెప్పాడు.
పెళ్లి ఇప్పుడెందుకులే అంటూనే.. అమ్మో దానికి మనకు అస్సలు పడదుగా అని ప్రదీప్ చెప్పాడు. పెళ్లికి మనం చాలా దూరం అంటూ తనపై తానే పంచ్ వేసుకున్నాడు.
తన పెళ్లిపై వచ్చే కామెంట్స్‌ను వినీ వినీ చివరికి తనపై తానే జోకులు వేసుకోవడం మొదలు పెట్టాడు. యూ ట్యూబ్‌లోనూ తనపై కొత్తగా రాస్తుంటారని.. వాటిని చూసి నవ్వుకుంటానని ప్రదీప్ చెప్పాడు.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రదీప్ నిజంగానే పెళ్లి కొడుకు కాబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ప్రదీప్ ఓ రాజకీయ కుటుంబానికి అల్లుడు కాబోతున్నాట్టు తెలుస్తోంది.
టీడీపి తరఫున యాక్టివ్‌గా ఉన్న ఓ యువ నేతతో ఈయన ఏడడుగులు నడవబోతున్నాడనే వార్త వైరల్ అవుతోంది. రాయలసీమలోని యువ రాయకీయ వేత్తతో ప్రదీప్ మూడు ముళ్ల బంధం పెనవేసుకోబోతోందనే వార్తలు వస్తున్నాయి.
మరి దీనిపై ప్రదీప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.