యాంక‌ర్ అనసూయకు న‌చ్చిన ప్లేస్ ఏంటో తెలుసా?

272

ఈటీవి జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యమైంది అనసూయ భ‌ర‌ద్వాజ్. ఆ త‌ర్వాత సినిమాల్లోనూ న‌టిస్తూ మ‌రింత చేరువైంది.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో అనసూయ పేరు తెలియని బుల్లితెర, వెండితెర ప్రేక్షకులు ఉండరన‌డంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంత బాగా ఆమె ప్రేక్షకులకు దగ్గరైపోయారామె.

ఒకవైపు టీవీ షోలు చేస్తూ.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.

ఒక వైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు తన ప్రొఫెషనల్ కెరీర్‌కు న్యాయం చేస్తూ సమయాన్ని చాలా స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకుంటున్నారు.

తాను ఎవరి సలహా తీసుకోనని.. తనకు నచ్చినట్టు ఉంటానని ఎప్పుడూ అనసూయ చెప్తూ ఉంటారు. అయితే తాజాగా ఆమె యూట్యూబ్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు.

అందులోనూ తన అభిమానులకు అదే చెప్పారు. టీవీ, సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అనసూయ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఆమె ఫ్యాన్స్‌ను పలకరిస్తూనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షూట్‌లు అప్‌లోడ్ చేస్తూ యువతకు నయనానందాన్ని కలిగిస్తున్నారు.

ఇక యూట్యూబ్ ద్వారా తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన వీడియోలను పంచుకుంటున్నారు.

తాజాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ వీడియో ద్వారా తన ఇంట్లో తనకు చాలా ఇష్టమైన ప్రదేశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

అనసూయకు తన ఇంట్లోని బాల్కనీ ఏరియా అంటే చాలా ఇష్టమట. ఆ బాల్కనీ ప్లేస్‌ను చాలా అందంగా అలంకరించుకున్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడానికి చిన్న వ్యాయామశాలను ఏర్పాటు చేసుకున్నారు.

ఒక వుడెన్ డైనింగ్ టేబుల్, సోఫా, పక్షులు, ఇంటిలోపల పెంచుకునే చిన్న చిన్న మొక్కలతో బాల్కనీ ఏరియా చాలా అందంగా ఉంది. అందుకే ఇక్కడే రోజూ ఆమె రెండు మూడు గంటలు గడుపుతారట.
ఒకప్పుడు జాగింగ్ కోసం బయట పార్క్‌కు వెళ్లేదాన్ని అని.. అయితే బయటకు వెళ్లడం వల్ల తనతో పాటు పార్క్‌లో ఉన్నవాళ్లు ఇబ్బంది పడుతున్నారని అందుకే ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకున్నానని ఆమె వెల్లడించారు.

ఇంకా అనసూయ చెప్పిన విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు.