అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్స్

323

వేస‌వి కాలంలో కూల‌ర్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు చాలా అవ‌స‌రం. ఎండా కాలంలోనే చాలా కంపెనీలు ఆఫ‌ర్లు, డిస్కౌంట్‌లు ప్ర‌క‌టిస్తుంటాయి.

ఈ క్ర‌మంలోనే ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్టివల్ పేరుతో భారీ ఆఫర్లను తెచ్చింది.

సమ్మర్ సేల్ లో భాగంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా రాయితీలు ఇస్తోంది.

ఇక ఈ సేల్ ఫిబ్రవరి 26 తారీకు నుండి 28వ తారీకు వరకు కొనసాగనుంది.

అమెజాన్ సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్టివల్లో గృహోపకరణాలపై వోల్టాస్ , ఎల్ జి, వర్ల్ పూల్, డాకింగ్, శాంసంగ్, సింఫనీ, గోద్రెజ్ కంపెనీలకు చెందిన బ్రాండ్ల‌పై పెద్ద మొత్తంలో రాయితీలను ప్రకటించింది.

అంతేకాదు కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇందుకు ఈఎమ్ఐ 10 శాతం అదనంగా డిస్కౌంట్లు కూడా ఇస్తోంది.

ఎయిర్ కండిషనర్‌పై 40 శాతం, రిఫ్రిజిరేటర్‌పై 35 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

వోల్టాస్, ఎల్ జి, వర్ల్ పూల్, డాకిన్, సాన్యో తదితర బ్రాండ్లపై ఈ రాయితీలు వర్తిస్తాయని పేర్కొంది.

అంతేకాకుండా ఎల్జి , శాంసంగ్, వర్ల్ పూల్ , హైయర్ , గోద్రెజ్ తదితర బ్రాండ్ల రిఫ్రిజిరేటర్ లపై 35 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది.

రిఫ్రిజిరేటర్ల ఎక్స్చేంజి పై 12 వేల వరకు రాయితీ ఇస్తోంది. కూలర్స్ మరియు యాక్సెసరీస్‌పై 50 శాతం, సింపని, క్రాంప్టన్ , బజాజ్, హావెల్స్ కూలర్స్, యాక్సెసరీస్‌పై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది.