హైదరాబాద్: ప్రముఖ టెలీకమ్యూనికేషన్స్ సేవల సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (ఎయిర్‌టెల్), టాలీవుడ్ సినిమా డియర్ కామ్రేడ్ టీంతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ సినిమాలో నటించిన తారాగణంను కలుసుకునే అవకాశం సొంతం చేసుకోనున్నారు. డియర్ కామ్రేడ్ తారాగణం హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నతోపాటు సినిమాలో నటీనటులను కలుసుకోవచ్చు. దీంతో పాటు డియర్ కామ్రేడ్ ప్రమోషన్ కోసం మైత్రి మూవీ మేకర్స్‌తో ఎయిర్‌టెల్ కలిసి పనిచేస్తోంది.
ఎయిర్‌టెల్, డియర్ కామ్రెడ్ టీం మధ్య కుదిరిన ఈ ఒప్పందం వల్ల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కేటగిరీలలో ప్రత్యేకమైన “డియర్ కామ్రేడ్’ ప్యాక్‌లు లాంచ్ చేయనున్నారు. రూ.169 ప్రీపెయిడ్‌తో రీచార్జ్ చేసుకున్నవారు, ఎయిర్‌టెల్ లైఫ్ స్టైల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.499 లేదా అంతకుమించి వినియోగదారుల్లోని లక్కీ కస్టమర్లు ఎయిర్‌టెల్ మీట్ & గ్రీట్‌లో భాగంగా, డియర్ కామ్రెడ్ సినిమాలో నటీనటులను కలుసుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతోపాటుగా వినియోగదారులు ప్రత్యేకమైన డాటా, టాక్‌టైంతోపాటు మరెన్నో ప్రయోజనాలను ఎయిర్‌టెల్ ప్యాక్, ప్లాన్‌లపై పొందవచ్చు.
ఎయిర్‌టెల్‌కు చెందిన అన్ని రకాలైన కమ్యూనికేషన్ల వేదిక ద్వారా `డియర్ కామ్రెడ్` ప్రచారం సాగించడం, ఆసక్తికరమైన పోటీలు నిర్వహించడంతో పాటుగా విజేతలకు ప్రత్యేకమైన మీట్ ఆండ్ గ్రీట్ అవకాశం, సినిమా టికెట్లు పొందడం సహా మరెన్నో ఆకర్షణీయమైన ప్రయోజనాలు కల్పించనుంది.