రూ. 19 రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్‌

387

త్వ‌ర‌లో టెలికం చార్జీలు పెర‌గ‌బోతున్న స‌మ‌యంలో త‌క్కువ ధర‌కే అన్‌లిమిటెడ్ కాల్స్ ఇవ్వ‌డం నిజంగా ఊర‌ట క‌లిగించే అంశం. ఎయిర్‌టెల్ సంస్థ ఒక కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

కేవలం రూ.19 రీచార్జ్‌ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని భారతీయ ఎయిర్‌టెల్‌ తెలిపింది.

అయితే ఈ ప్లాన్‌ వాలిడిటీ కేవలం రెండు రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్ ఈ రీచార్జ్ ప్లాన్‌ను ‘ట్రూలీ అన్‌లిమిటెడ్’ కేటగిరి కింద అందిస్తోంది. అంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని అర్థం.

మొత్తంమీద రెండు రోజులు వాలిడిటీ అయినా రూ.19కే అన్‌లిమిటెడ్ కాల్స్ అనేది మంచి ప్లానేనని వినియోగదారులు చెప్పుకొంటున్నారు. అంతేకాదు 200 ఎంబీ డేటా కూడా వస్తుంది.

ఇదే కాకుకుండా ప్రతీనెలా, లేదా మూడు నెలలకోసారి రీచార్జ్‌ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఒకేసారి సంవత్సరానికి రీచార్జ్‌ చేసుకోవచ్చు. దీనికి రూ. 2698 ప్లాన్ అందుబాటులో ఉంది.

దీని వాలిడిటీ 365 రోజులు. రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. దీంతో పాటు… డిస్నీ హాట్‌స్టర్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగానే లభించనుండడం విశేషం.

తమ కొత్త ప్లాన్ వినియోగదారులకు పూర్తి వెసులుబాటుగా ఉంటుందని ఎయిర్‌టెల్ చెబుతోంది.