భీష్ముడి పాత్రలో బాలయ్య…!

333
Balakrishna shares Bishma getup stills from NTR Kathanayakudu

ఈరోజు భీష్మ ఏకాదశి. ఈ సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఓ స్పెషల్ పిక్ ను షేర్ చేశారు.

“ఎన్టీఆర్ కధానాయకుడు” చిత్రంలో బాలయ్య భీష్ముని పాత్రలో నటించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ పాత్ర సినిమాలో కన్పించలేదు.

కానీ తాజాగా భీష్మ ఏకాదశి సందర్భంగా తాను భీష్ముని పాత్రలో ఉన్న స్టిల్స్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… “భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు.

ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ఎన్ టీ ఆర్ కధానాయకుడు చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను.

అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు.

ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను” అని అన్నారు.