రకుల్ ప్రీత్ సినిమా షూటింగ్ లో రాళ్ల దాడి..!

394
Dhanipur Airstrip Villagers Pelt Stones On Rakul Preet Singh Movie Shooting

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

లక్ష్యరాజ్ దర్శకత్వంలో ‘ఎటాక్’ సినిమాను రూపొందుతోంది. చిత్రంలో జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 13న సినిమాను విడుదల చేయనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుతోంది.

ఇందులో భాగంగా ధనీపూర్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. యాక్షన్ సీన్లలో భాగంగా బాంబు బ్లాస్టులు షూట్ చేస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.

ఎవ్వరికీ దెబ్బలు, గాయాలు తగలకూడదని పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే షూటింగ్ చేస్తున్నారనే విషయం తెలిసి అక్కడికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు. షూటింగ్ స్పాట్ వద్ద గేటు మూసేయడంతో సెట్ గోడ ఎక్కి షూటింగు చూడటానికి జనం ఎగబడ్డారు.

దీంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రజలు రాళ్లదాడికి పాల్పడ్డారు.

వెంటనే పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దు మణిగింది. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడగా.. హీరో జాన్ అబ్రహం, హీరోయిన్ రకుల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

 

View this post on Instagram

 

A post shared by Aligarianhub (@aligarianhub)