“క్షణ క్షణం” ట్రైలర్ రిలీజ్ చేసిన తమన్నా

283
Trailer of Kshana Kshanam launched by Tamannaah

ఉదయ్ శంకర్, జియా శర్మాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “క్షణ క్షణం”.

ఈ సినిమాను కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో మన్నం చంద్రమౌళి, డాక్టర్ వార్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా “క్షణ క్షణం” సినిమా ట్రైలర్ ను మిల్కీ బ్యూటీ తమన్నా విడుదల చేశారు.

ట్రైలర్ ను చూసిన ఆమె కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని అన్నారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ “క్షణ క్షణం” టీంకు బెస్ట్ విషెస్ చెప్పారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే ఇంటరాగేషన్ రూమ్ లో స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత హీరో కథ, హీరోయిన్ తో ప్రేమ… కొన్ని యాక్షన్ సీన్స్, మరికొంచం సస్పెన్స్ తో కూడి ఉంది.

మొత్తానికి ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా అంచనాలు కూడా పెంచేసింది.

మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.