యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచి యాక్ట్ ఫైబర్ నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వారికి కావాల్సినంత డేటా లభించబోతోంది. ఈ బంపర్ ఆఫర్ కేవలం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో నివసించే వారికి మాత్రమే ఆఫర్ చేయడం విశేషం.
చెన్నైలో నివసిస్తూ, ఇప్పటికే వివిధ యాక్ట్ ఫైబర్ నెట్ ప్లాన్లకు సబ్ స్రైబ్ చేసినవారికి అదనంగా 1500 జీబీ డేటాను అందించనుంది. ఈ డేటాను మార్చి ఒకటి 2018 నుండి ఆగస్టు 31, 2018 లోపు మాత్రమే ఉపయోగించుకోగలరు. ఆరు నెలల పాటు ఈ డేటాను వినియోగదారులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
అలాగే హైదరాబాద్లో నివసించే యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారులకు 1000జీబీ డేటా అందించనున్నారు. రెగ్యులర్ గా వినియోగదారులు ఉపయోగించే ప్లాన్ కి అదనంగా ఆ డేటా లభిస్తుంది. ఆరు నెలలు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
బెంగళూరులోని వినియోగదారులకు కూడా 1000జీబీ డేటా లభించనుంది. దీనిని యాక్ట్ ఫైబర్ నెట్ వెబ్ సైట్ లో అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ.. రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.