ఒకే రోజు లక్షకు పైగా పెళ్లిళ్లు

289
one-lakh-marriages-march-4th

తెలంగాణ రాష్ట్రం మార్చి 4వ తేదీన పెళ్లి వాయిద్యాలతో మారుమోగిపోనుంది. రెండు మాసాల తర్వాత వస్తున్న శుభగడియలు కావడంతో ఆ ఒక్కరోజే దాదాపు ఒక లక్ష పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. గత ఏడాది నవంబరు 23, 26 తేదీల తర్వాత మళ్లీ మంచి రోజులంటూ మార్చినెలలోనే వచ్చాయి. ఇంత వ్యవధి తర్వాత వస్తున్న .. మార్చి నాలుగో తేదీ చాలా బలమైన ముహూర్తమని పండితులు చెబుతున్నారు.



అదే నెల 6, 11 తేదీల్లోనూ బలమైన ముహుర్తాలు ఉండడంతో అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఇప్పుడు కాకుంటే మళ్లీ ఏప్రిల్‌లో శ్రీరామనవమి తర్వాతే పెళ్లి ముహుర్తాలు వస్తాయి. మార్చి 4, 6, 11 తేదీల్లోని అత్యధిక ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటలకు ముందువే కావటం విశేషం. 4న హస్త నక్షత్రం, తిథి తదియ కావడంతో ముహూర్త బలం బాగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మార్చి 6న స్వాతి నక్షత్రం, పంచమి, 11న పూర్వాషాడ నక్షత్రం, దశమి కావడంతో ఈ మూడు రోజుల్లోనే ముహూర్తాలు ఎక్కువ మంది ఫిక్స్ చేసుకున్నారట. ఇక మార్చి 11వ తేదీ తర్వాత 25వ తేదీ వరకు ముహూర్తాలు లేవంటున్నారు.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ఫంక్షన్‌ హాళ్లు ఎప్పుడో బుక్కయిపోయాయి. ఫంక్షన్ హాళ్లు ఇప్పటికే బుక్ చేసుకున్న వారు ఏర్పా్ట్లలో నిమగ్నమయ్యారు. అటు షాపింగ్‌లో పెళ్లింటి వారు బిజీగా గడుపుతున్నారు.