శ్రీదేవి పట్టుతప్పి నీటి టబ్ లో పడి మృతి: ఫోరెన్సిక్ నివేదిక

298
sridevi death is accidentally drowned

శ్రీదేవి మృతిలో మ‌రో ట్విస్ట్..! ఆమె గుండెపోటుతో మ‌ర‌ణించ‌లేద‌ని డాక్ట‌ర్లు తేల్చారు. ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో మునిగి మ‌ర‌ణించిన‌ట్లు ఫోరెన్సిక్ నివేదిక‌లో తేలింది. శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఆమె ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లోని టబ్‌లో మునిగి మృతి చెందింద‌ని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని తేల్చి చెప్పారు. అయితే ఆమె రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఫోరెన్సిక్‌ నివేదికను శ్రీదేవి కుటుంబ సభ్యులకు భారత దౌత్య అధికారులు అందించారు.



మ‌ద్యం మ‌త్తులో బ్యాలెన్స్ త‌ప్పి.. బాత్‌టబ్‌లో ప‌డ‌టంతో నీటిలో మునిగి ఊపిరాడ‌క ఆమె చ‌నిపోయుంటుంద‌ని వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఇక ఆమె మృతదేహాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం కానుంది. ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దుచేయడం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలాంటి పనులు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నీ అందుకున్న తర్వాత మృతదేహాన్ని అప్పగించనున్నారు.