“ఆర్ఆర్ఆర్” శాటిలైట్ రైట్స్… భారీ రేటుకు కొనుగోలు చేసిన లైకా…!

277
Tamil Nadu theatrical rights of RRR Movie is acquired by Lyca Productions

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’ (రౌద్రం ర‌ణం రుధిరం)’.

“ఆర్ఆర్ఆర్” చిత్రంలో మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఒకేసారి విడుదల కానుంది.

ద‌స‌రా కానుకగా అక్టోబ‌ర్ 13న “ఆర్ఆర్ఆర్” ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడ‌వుతున్నాయి.

“ఆర్ఆర్ఆర్” త‌మిళ హ‌క్కులను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా రూ.45 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

త‌మిళ‌నాడులో రాజ‌మౌళి సినిమాల‌కు విపరీత‌మైన క్రేజ్ ఉంది.

అందుకే త‌మిళ్ థ్రియాట్రిక‌ల్ రైట్స్ కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించిన‌ట్టు టాక్‌.

ప్రస్తుతం ఈ వార్త ట్రేడ్ వ‌ర్గాలను విస్మ‌యానికి గురి చేస్తుంది.