మంచి ధరకు “చెక్” ప్రీ రిలీజ్ బిజినెస్

243
Nithin's Check Movie Trailer

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “చెక్”.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న “చెక్” చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్న “చెక్” చిత్రంలో సిమ్రాన్ చౌదరి, పోసాని కృష్ణ మురళి, సాయి చంద్, మురళి శర్మ, హర్ష వర్ధన్, సంపత్ రాజ్, రోహిత్ తదితరులు నటిస్తున్నారు.

ఇక ప్రియా వారియర్ కు తెలుగులో “చెక్” మొదటి చిత్రం కావడం విశేషం. కాగా “చెక్” చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది.

“చెక్” సినిమా థియేట్రికల్ హక్కులు మంచి ధరకు అమ్ముడుపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు “చెక్” సినిమాకు రూ.15 కోట్లు వెచ్చించారని సమాచారం.

నైజాం రైట్స్‌ను వరంగల్ శ్రీను రూ.5 కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు. ఈ రూ.15 కోట్లతో పాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా నిర్మాతకు మరో రూ.12 కోట్లు వసూలైందని తెలుస్తోంది.

దేశద్రోహం, ఉగ్రవాదం కేసులో అరెస్టయిన ఒక చెస్ ఛాంపియన్.. జైలులో ఉంటూనే తనను ఎలా నిరూపించుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను చంద్రశేఖర్ యేలేటి రూపొందించారు.

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం బి, సి ఏరియాల్లో పెద్దగా ప్రభావం చూపించలేదని విశ్లేషకులు అంచనా వేశారు.

కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆ అంచనాలను దాటేసింది.