యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న వింటేజ్ ప్రేమకథా చిత్రం “రాధేశ్యామ్” నుంచి మరో అప్డేట్ వచ్చింది.
ఫిబ్రవరి 14 ఉదయం 9.18 ని.లకు సినిమా గ్లిమ్ప్స్ ను విడుదల చేయనున్నట్టు ఈ అప్డేట్ లో పేర్కొన్నారు.
Directed by @director_radhaa
Presented by @UVKrishnamRaju garu
Produced by @UV_Creations @TSeries #BhushanKumar with #Vamshi #Pramod & @PraseedhaU under @AAFilmsIndia @GopiKrishnaMvs pic.twitter.com/22V0eNMtnc— UV Creations (@UV_Creations) February 12, 2021
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా “రాధేశ్యామ్” తెరకెక్కుతోంది.
1960 దశకం నాటి పునర్జన్మల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ పై పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
“రాధేశ్యామ్” చిత్రంలో సీనియర్ హీరోయిన్ సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించగా… హిందీలో మాత్రం మిథున్ మనన్ భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
ప్రభాస్ 20వ చిత్రమైన “రాధేశ్యామ్”పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.