నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య

257
Gopichand Malineni to direct Balakrishna

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ తరువాత ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఉండబోతోంది. ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు.

తాజాగా ‘ఉప్పెన’ ప్రమోషన్‌లో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాలకృష్ణ కోసం గోపీచంద్ మలినేని ఓ కథ సిద్ధం చేస్తున్నారని,

బాలయ్య చేస్తున్న BB3 షూటింగ్ ఫినిష్ కాగానే తమ బ్యానర్‌పై ఈ సినిమా సెట్స్ మీదకొస్తుందని తెలిపారు.

ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలు రీచ్ అయ్యేలా ఉంటుందని, దీని కోసం తాము కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నామని అన్నారు.

ఉగాది సందర్భంగా ఏప్రిల్ నెలలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఆ వెంటనే మే నెలలో రెగ్యులర్ షూట్ ప్రారంభించనున్నారని టాక్.

ప్రస్తుతం స్క్రిప్ట్ డెవెలప్ చేసే పనిలో ఉన్న ఆయన ఈ భారీ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా షురూ చేశారనేది టాక్.

కాగా మైత్రీమూవీస్ రాబోయే రెండేళ్ళలో 9 సినిమాలను నిర్మించనుంది. శుక్రవారం ‘ఉప్పెన’తో ఆడియన్స్ ముందుకు వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రస్తుతం అల్లుఅర్జున్ తో ‘పుష్ప’, మహేశ్ బాబుతో ‘సర్కారువారి పాట’, నానితో ‘అంటే సుందరానికి’ సినిమాలు ఉన్నాయి.

పవన్‌ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా పూజ జరుపుకుంది. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా, విజయ్ దేవరకొండ, శివనిర్వాణతో చిత్రం,

చిరంజీవి హీరోగా బాబీ డైరక్షన్ లో మూవీ, బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేనితో సినిమా లైన్లో ఉన్నాయి.

ఇవి కాకుండా ప్రభాస్ డేట్స్, తమిళ స్టార్ హీరో విజయ్ డేట్స్ కూడా బ్లాక్ చేశారు. త్వరలో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

సల్మాన్ ఖాన్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్.

కాగా మైత్రీ చిత్రపరిశ్రమలోకి ‘శ్రీమంతుడు’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ‘జనతాగ్యారేజ్’, రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ తీసి హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది.

ఆ తర్వాత ‘సవ్యచాచి’, ‘అమర్ అక్బర్ ఆంటోని’, ‘చిత్రలహరి’, ‘డియర్ కామ్రేడ్’, ‘గ్యాంగ్ లీడర్’, ‘మత్తువదలరా’ చిత్రాలను వరుసగా నిర్మించింది.

ప్రస్తుతం రానున్న భారీ సినిమాలు చాలా వరకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతుండడం గమనార్హం.