సంపూర్ణేష్ బాబు “బ‌జార్‌రౌడీ” మోష‌న్ పోస్ట‌ర్‌

242
Motion Poster of Sampoornesh's

కేఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు న‌టిస్తోన్న తాజా చిత్రం “బ‌జార్‌రౌడీ”. వ‌సంత నాగేశ్వ‌ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సందిరెడ్డి శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ్ ర‌క్షిత్మాస్ట‌ర్ సంపూకు కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు.

సంపూర్ణేశ్‌బాబు హృద‌య‌కాలేయం, సింగం 123, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాల త‌ర్వాత చేస్తున్న చిత్రం “బజార్ రౌడీ”.

తాజాగా ఈ చిత్రం నుంచి మోష‌న్ పోస్ట‌ర్‌ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ఛార్మినార్, హైద‌రాబాద్ మెట్రో రైలు స్టిల్స్ తో మొద‌లైన మోషన్ పోస్టర్… జీపులో రౌడీ గ్యాంగ్ హ‌ల్చ‌ల్ చేస్తుండ‌గా..

సంపూర్ణేశ్ న‌డి రోడ్డుపై మంచం మీద ప‌డుకొని స్టైలిష్ గా సిగ‌రెట్ అంటిస్తున్న మోష‌న్ పోస్ట‌ర్ ఆసక్తికరంగా ఉంది.

మీరు కూడా ఈ మోషన్ పోస్టర్ ను వీక్షించండి.