పవన్ బాబాయి కిక్ బాక్సింగ్ శిక్షణ కోసం థాయ్‌లాండ్‌కు పంపారు : వైష్ణవ్ తేజ్

210
Pawan Babai sent me to Thailand to train kickboxing: Vaishnav Tej

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం “ఉప్పెన”. ఈనెల 12 భారీ ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు.

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం “ఉప్పెన” ప్రమోషన్ కార్యక్రమాలతో చిత్రబృందం బిజీగా ఉంది.

తాజాగా “ఉప్పెన” గురించి వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ “నేను ఒక రొటీన్ కమర్షియల్ మూవీతో వెండితెర ఎంట్రీ ఇవ్వాలని అనుకోలేదు. “ఉప్పెన”లో నా పాత్రలో నటనకు మంచి స్కోప్ ఉంది.

విజయ్ సేతుపతి వంటి గొప్ప నటుడితో కలిసి నటించడం అంత సులభం కాదు. చిత్రం విడుదలైనప్పుడు ప్రేక్షకుల స్పందనను చూడటానికి ఆతృతగా ఉన్నాను.

కిక్-బాక్సర్ కావాలన్నది నా కల. ముందుగా కిక్ బాక్సర్ గానే కెరీర్ కొనసాగించాలనుకున్నాను.

పవన్ కళ్యాణ్ బాబాయి నన్ను కిక్ బాక్సింగ్ శిక్షణ కోసం థాయ్‌లాండ్‌కు కూడా పంపించాడు.

అయితే ఆ శిక్షణ అంతా నాకు “ఉప్పెన”లోని యాక్షన్ సన్నివేశాలను తీయడానికి సహాయపడింది” అంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు వైష్ణవ్ తేజ్.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభించింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి రావడంతో కావలసినంత హైప్ లభించింది.

మరి సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.